MLC Kavitha : తెలంగాణలో మత కలహాలు పెరిగాయి : ఎమ్మెల్సీ కవిత

by Muthe.Rajitha |

నేడు సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు లింగమంతుల జాతర(Peddagattu Lingamanthula Jathara)లో పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha).

MLC Kavitha : తెలంగాణలో మత కలహాలు పెరిగాయి : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు లింగమంతుల జాతర(Peddagattu Lingamanthula Jathara)లో పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha). ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడటం వల్లనే సూర్యాపేట జిల్లా(Suryapeta District) ఏర్పాటు అయిందన్నారు. కేసీఆర్(KCR) పాలనలో మాత్రమే సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యిందని, అంతకముందు ఉన్న పాలకులు సూర్యాపేటను పట్టించుకోలేదని విమర్శించారు. అడుగడుగునా రాష్ట్రాన్ని అభివృద్ది చేసింది బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. గురుకుల స్కూళ్ళు, మహిళా కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేసింది కేసీఆర్ మాత్రమే అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలోని ఏ అంశం మీద దృష్టి లేదని.. ఆయన దృష్టి అంతా ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత కల్పించామని.. ఎవరైనా ఆడపిల్లల వైపు చూడాలంటే వణికి పోయారని, ఇపుడు రాష్ట్రంలో మహిళలపై క్రైం రేటు 20 శాతం పెరిగిందని .. మహిళలకు భద్రత అనేది లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకో మత కలహం జరుగుతోందని.. పాలన గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాలను సూర్యాపేటలో పారించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని.. ఈ ప్రాంతం కృష్ణా నది కిందికి వచ్చినప్పటికీ, గోదావరి నీటిని ఇక్కడి దాకా పారించి పంటలు పండించేలా చేసింది తమ ప్రభుత్వం మాత్రమే అన్నారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీటి నిలువలు అడుగంటి పోయినా.. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతు ఎండిపోతున్నా.. పంటలు ఎండిపోతున్నా సీఎంకు గాని, ఉత్తమ్ కు గాని చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఈ పాపం అంతా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తాకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని.. ప్రజల బాగు కోసం పని చేయాలి తప్పితే.. మైక్ దొరికింది కదా అని కేసీఆర్ ను తమ పార్టీ నాయకులను తిడుతూ కూర్చుంటే స్వయంగా సీఎం తన విలువ తగ్గించుకున్నట్టే అని కవిత వెల్లడించారు.

Next Story