వరంగల్ సభపై అసంతృప్తి..కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-22 13:22:57  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. ఆ లేఖలో కవిత వ‌రంగ‌ల్ బ‌హిరంగ స‌భ విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

వరంగల్ సభపై అసంతృప్తి..కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ!
X

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. ఈ లేఖ మొత్తం 6 పేజీలు ఉంది. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ ప‌లు విష‌యాల‌ను ఇందులో ప్ర‌స్తావించారు. లేఖ‌లో ముఖ్యంగా కవిత వ‌రంగ‌ల్ బ‌హిరంగ స‌భ విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని లేఖ‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదని అభిప్రాయ‌ప‌డ్డారు.

పార్టీ నేత‌ల‌కు యాక్సెస్ ఇవ్వ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామ‌ని, బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, తాను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని పేర్కొన్నారు.

అంతే కాకుండా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని అన్నారు. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారని, ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని సూచించారు. అంతే కాకుండా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణపై మాట్లాడ‌లేద‌ని, వ‌క్ఫ్ చ‌ట్టం గురించి మాట్లాడ‌లేద‌ని పేర్కొన్నారు. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌ను పాత ఇంచార్జ్‌లకు అప్పజెప్పడం వ‌ల్ల‌ వాళ్లు తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేద‌ని ఫీడ్ బ్యాక్ అందిందన్నారు. ఓవ‌రాల్‌గా వ‌రంగ‌ల్ స‌భ‌లో ఇంకొంచెం పంచ్ ఆశించారని కానీ ఫైనల్‌గా లీడర్స్ క్యాడర్ సంతృప్తి చెందార‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

Next Story