కవితతో ఎమ్మెల్సీ అభ్యర్థి హరికృష్ణ భార్య భేటీ.. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్

by Ramesh Naini |

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

కవితతో ఎమ్మెల్సీ అభ్యర్థి హరికృష్ణ భార్య భేటీ.. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ (Prasanna Harikrishna) గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ను ప్రసన్న హరికృష్ణ భార్య కలవడం హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేములవాడ‌ రాజన్న సన్నిధిలో ఎమ్మెల్సీ అభ్యర్థి భార్య ప్రసన్న కవితను కలిశారు. వారిద్దరు కలిసి పూజల్లోనూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరగా కవిత సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీలకు మద్దతు ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తెలంగాణలో ఈ నెల 27న జరుగుతున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదనే విషయం విదితమే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీ పడుతున్నాయి. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్నాయి.

Next Story