- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addnaki Dayakar: ఇంటి సమస్య పరిష్కరించుకోలేని మీరు రాష్ట్ర సమస్యలు తీరుస్తారా?.. బీఆర్ఎస్ పై అద్దంకి
బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరబాదుడుకు భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఏ చిన్న సందు దొరుకినా దూరిపోయే కేసీఆర్ తనకు చెప్పుకోవడానికి ఏమి లేకనే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన అద్దంకి.. దొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ సెంటిమెంట్ గూర్తుకు రాని వాళ్లు ఇవాళ తెలంగాణ పేరుతో బయటకు వస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారులు అంటే కేవలం నలుగురేనని ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారన్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రజల పక్షమే అయితే వారికి ఈ దుర్గతి పట్టేదే కాదన్నారు. ప్రతి సందర్భంలో ప్రజలను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంటున్నదని విమర్శించారు. మొదట మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేని మీరు రాష్ట్ర సమస్యలను ఏం పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి, కోదండరెడ్డి, మందకృష్ణమాదిగ వంటి వారిని అరెస్టు చేసిన మీకు ఇవాళ కేసులు, అరెస్టులు అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరే బయట తిరుగుతుంటే తెలంగాణ సమాజం మిమ్మల్నెందుకు సహించాలన్నారు. మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరం కట్టారని ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ఇంత గొప్ప ప్రాజెక్టు అని చెప్పుకున్న వారు ఇప్పుడు ఆ గొప్పతనం మాదే అని చెప్పుకోవడానికి ఒక్కరూ ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వెసులుబాటు లేని కారణంగానే కొన్ని పథకాల అమలు ఆలస్యం అవుతోందని త్వరలోనే అన్ని పథకాలు అమలు అవుతాయన్నారు. తొమ్మిదేళ్లుగా మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ హామీలపై మాట్లాడితే నడువదన్నారు. కొన్ని మీడియా సంస్థలకు తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేకపోవచ్చు. కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ నాయకులు ఇచ్చే తాయిలాల కోరకు వారి అబద్ధాలు ప్రచారాలను చేయవద్దన్నారు. దీని వల్ల తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుందన్నారు. మీడియా నిక్కచ్చిగా వ్యవహరించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అన్నారు. మీడియాను ఎవ్వరేమీ చేయలేరని ఎవరైనా వస్తే మీకు అండగా మేముంటామన్నారు.






