వారిని రోకలి బండతో కొట్టండి.. మీ తరపున జైలుకు నేను వెళ్తా: ఎమ్మెల్యే సంజయ్

by Malleboina Mahesh |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరుగుతున్న అవినీతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వారిని రోకలి బండతో కొట్టండి.. మీ తరపున జైలుకు నేను వెళ్తా: ఎమ్మెల్యే సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme)లో జరుగుతున్న అవినీతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకానికి సంబంధించిన ప్రయోజనాలు అందించేందుకు ఎవరైనా డబ్బులు కోరితే, “అలాంటి వారి తీరును సహించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. అలాగే ఎవరైనా ఈ పథకం విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తే.. అలాంటి వారిని రోకలి బండతో కొట్టండి, అవసరమైతే మీ తరపున జైలుకు నేను వెళ్తా” అని సంజయ్ స్పష్టం చేశారు.

పథకాల కోసం ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వకూడదని ప్రజలకు ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ రోజు ఆయన ఓ సమావేశంలో నియోజకవర్గం ప్రజలతో మాట్లాడుతూ.. ఇలా డబ్బులు దోచుకునే దొంగల ప్రవర్తనను ముందుగానే అంచనా వేసినందుకే మాజీ సీఎం కేసీఆర్ పథకాల నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసే విధానం అమలు చేశారని గుర్తుచేశారు. ప్రజల హక్కులు చేరేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఎప్పటికప్పుడు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

Next Story