- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహనం కోల్పోయి మాట్లాడుతుండు.. జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్
జగిత్యాల (Jagityal) నియోజకవర్గంలో కాంగ్రెస్ (Congress) కోసం కలిసి పని చేయడానికి అక్కడి ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) ఎవరంటూ ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల (Jagityal) నియోజకవర్గంలో కాంగ్రెస్ (Congress) కోసం కలిసి పని చేయడానికి అక్కడి ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) ఎవరంటూ ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అసలు సంజయ్ ఏ పార్టీ ఎమ్మెల్యే అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏ పార్టీనో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ (Prasad Kumar)ను అడిగితే తెలుస్తుందని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి అత్యధిక సార్లు ఓడిపోయన వ్యక్తి జీవన్ రెడ్డి అని సెటైర్లు వేశారు. ఆయన ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా ఓడిపోయాడని ఫైర్ అయ్యారు. గాంధీభవన్ (Gandhi Bhavan)లో కూర్చొని ఇండిపెండెంట్ అంటున్నారని ఎద్దేవా చేశారు. తన విషయంలో జీవన్ రెడ్డి పూర్తిగా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సంజయ్ కామెంట్ చేశారు.






