Raja Singh: కొత్త బీజేపీ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

బీజేపీ స్టేట్ చీఫ్‌గా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మంచి అడ్వకేట్ అని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.

Raja Singh: కొత్త బీజేపీ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్‌గా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు (Ramachandra Rao) మంచి అడ్వకేట్ అని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు డమ్మీ.. డమ్మీ అని అందరన్నారని గుర్తుకు చేశారు. అప్పుడు తాను డమ్మీని కాదు డాడీని అన్న రామచందర్ రావుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా.. అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డమ్మీ కాదని నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నారు. కొత్త బీజేపీ చీఫ్‌కు ఓ పని ఇవ్వాలని అనుకుంటున్నా.. ఓ అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేసి.. ఎట్టి పరిస్థితుల్లో ఫాతిమా కాలేజీని కూల్చేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజీ పెట్టి చెరువుని కబ్జా చేశారని ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో చెరువులను కాపాడడానికి ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చిందని గుర్తుకు చేశారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫాతిమా కాలేజీపై ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారని అన్నారు.

ఓవైసీ కాలేజీలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారని, దాంతో ఎంతో మంది పేదలకు ఉపాధి లభిస్తుందని రంగనాథ్ అన్నట్లు చెప్పారు. ఆయన అది కూలగొట్టాలా? వద్ద? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. హైడ్రా వచ్చిన తర్వాత ఎంతో మంది పేదల ఇండ్లను కూల్చారు.. దీంతో చాలా మంది పేదలను రోడ్డు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు మీకు వారి బాధ కనపడలేదా? అని హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించారు. నేడు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మంచి దోస్తులు అయ్యాయని, అందుకోసమే ఫాతిమా కాలేజీని కూలగొట్టడం లేదని ఆరోపించారు. ఫాతిమా కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో కూల్చాల్సిందేనని, లేదంటే కాలేజీని గవర్న్‌మెంట్ తీసుకోని దాన్ని గవర్న్‌మెంట్ కాలేజీగా మార్చాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Next Story