- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీకి మన సత్తా చూపించాల్సిన టైమొచ్చింది.. MLA రాజాసింగ్ సంచలన మెసేజ్
తెలంగాణలో బీజేపీ(BJP Telangana) జిల్లా అధ్యక్షుల ప్రకటన మరోసారి వివాదాలకు దారి తీసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ(BJP Telangana) జిల్లా అధ్యక్షుల ప్రకటన మరోసారి వివాదాలకు దారి తీసింది. తాను చెప్పిన వ్యక్తికి గోషామహల్ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి తమ బలం ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందంటూ.. అనుచరులు, పార్టీ శ్రేణులకు రాజాసింగ్ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొన్ని జిల్లాల్లో అధ్యక్షుల ఎంపికపై అసంతృప్తి నెలకొంది.
కాగా.. తొలి విడతలో 19 జిల్లాలకు అధ్యక్షుల(BJP Dist Presidents)ను ప్రకటించిన అధిష్టానం.. ఇవాళ రెండో విడతలో నాలుగు జిల్లాలకు ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సి.గోదావరి, మహబూబాబాద్‌కు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ-గోషామహాల్‌కు టి. ఉమామహేంద్రను అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర సహా ఎన్నికల అధికారి కే.గీతామూర్తి అధికారిక ప్రకటన విడుదల చేశారు.






