- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం తరఫున ఆయనకు నలుగురు గన్‌మెన్‌లు ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం అధనంగా మరో 14 మంది ప్రైవేటు గన్‌మెన్‌లను సెక్యూరిటీగా నియమించింది. ఇటీవల కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్‌తో పాటు సీఎంపై పర్సనల్ విమర్శలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నుండి పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎన్ఎస్‌యూఐ సభ్యులు, ప్రజలు ఊరుకోరని ఉరికించి కొడతారని అన్నారు. మరికొందరు నేతలు సైతం వార్నింగ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సెక్యురిటీ పెంచినట్టు తెలుస్తోంది.






