నాకు స్పీకర్ నోటీసులు అందలేదు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

పార్టీ ఫిరాయింపులు అంశంలో భాగంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ చేపట్టిన విచారణపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

నాకు స్పీకర్ నోటీసులు అందలేదు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపులు అంశంలో భాగంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ చేపట్టిన విచారణపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లోని మీడియాతో మాట్లాడుతూ అనర్హత పిటిషన్ పైన తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తనకు నోటీసు అందజేస్తే తన అభిప్రాయం ఏమిటనేది ఆయనకే చెప్తానని దానం స్పష్టం చేశారు. హోలీ వేడుకలు జరుగుతున్న సందర్భంగా దానం హోలీ సంబరాల్లో పాల్గొని యువతతో కలిసి ఆయన ఈ సందర్భంగా ఉత్సాహంగా డాన్స్ చేశారు.

Next Story