Nizamabad: వృథాగా.. మిషన్ భగీరథ నీరు!

by Geesa Chandu |

బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉర్ధూ ఉన్నత పాఠశాల వద్ద గల మంచి నీటి ట్యాంక్ కు మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారు.

Nizamabad: వృథాగా.. మిషన్ భగీరథ నీరు!
X

దిశ, వెబ్ డెస్క్: బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉర్ధూ ఉన్నత పాఠశాల వద్ద గల మంచి నీటి ట్యాంక్ కు మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారు. అయితే ఈ కనెక్షన్ ను భూమిలోపలి నుండి వేయాల్సి ఉండగా.. పని సులభం చేసుకునే ఉద్దేశంలో, పైపును భూమి పైనుంచే వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. అయితే సోమవారం నీటి ఒత్తిడి కారణంగా ఆ పైప్ లైన్ ఊడిపోయి నీరంతా వృథాగా పోతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాగునీరు వృథా అవుతుందని, వారి పనితీరు బాగాలేదని బీర్కూర్ మండల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story