ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ దాడి భారత్‍పై ఎలా ఎఫెక్ట్ కాబోతోంది?

by Prasad Jukanti |   (  Updated:2026-03-19 10:29:56  IST  )

ఖతార్‌లోని రాస్ లఫాన్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి భారత్ కు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ దాడి భారత్‍పై ఎలా ఎఫెక్ట్ కాబోతోంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మరింత పీక్స్‌కు చేరుతున్నది. గత 20 రోజులుగా ఏ దేశం కూడా తగ్గకుండా యుద్ధంలో ముందుకు వెళ్తున్నాయి. వేలాది మంది చనిపోతున్నా, కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ పరిణామంతో భారత్‌కు ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉన్నది. లేటెస్ట్‌గా ముందుగా వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఖతర్, సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఖతార్‌లోని అతిపెద్ద సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. తాజా దాడులు భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. భారత్ సహజ వాయువును దాదాపు 40 శాతం ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు అక్కడ దాడులతో ఉత్పత్తి నిలిచిపోవడంతో భారత్‌కు గ్యాస్ సరఫరా జగరడం చాలా కష్టమని ఇంధన ఆర్థికవేత్త కిరిత్ పారిఖ్ తెలిపారు. భారత ప్రజలు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రస్తుతం భారత్ రోజుకు సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఇందులో 97.5 దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. తాజా అనివార్య పరిస్థితుల కారణంగా భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 47.4 శాతం సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. ప్రపంచానికి ఇంటర్నెట్ ముప్పు!

Next Story