- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫీ టైమ్.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సెల్ఫీ దిగిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సెల్ఫీలు దిగడం అంటే అందరికీ ఇష్టమే.

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు (Selfies) సెల్ఫీలు దిగడం అంటే అందరికీ ఇష్టమే. ఏదైనా వేడుక జరిగినా.. కొత్త ప్రదేశానికి వెళ్లినా.. స్నేహితులతో సరదాగా ఉన్నా.. సెల్ఫీ దిగాల్సిందే, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాల్సిందే. సామాన్య ప్రజలు, సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ సెల్ఫీలు తీసుకోవడం అంటే దాదాపు ఇష్ట్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సెల్ఫీ టైమ్ అంటున్నారు.. తెలంగాణ మహిళా మంత్రులు. ఇవాళ (ఆదివారం) రాజ్‌భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma)తో మంత్రులు (Konda Surekha) కొండా సురేఖ, సీతక్క (Minister Seethakka) నవ్వుతూ సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.






