- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : విషాదంలో మంత్రుల వినోదం : కేటీఆర్
సంక్షేమ హాస్టల్ విద్యార్థుల(Welfare Hostel Students)కు భోజనం వండకుండా శివాలయంకు వెళ్లి తినాలని చెప్పిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : సంక్షేమ హాస్టల్ విద్యార్థుల(Welfare Hostel Students)కు భోజనం వండకుండా శివాలయంకు వెళ్లి తినాలని చెప్పిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. పరాకాష్టకు చేరిన ప్రజాపాలనకు ఇది నిదర్శనమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. విషాదంలో(ఎస్ఎల్బీసీ)నూ మంత్రుల వినోదం..హెలికాప్టర్ యాత్రలు..చేపకూర విందులు అని..హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులంటూ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఉందన్నారు. "
అన్నం వండలేదు గుడిలో తినండి" అని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది నిర్వాకాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారని..అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి హాస్టల్ సిబ్బంది వంట చేయడం మానివేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నారని..పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం వేశారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా? అని కేటీఆర్ ప్రశ్నించారు.






