- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు.. అభినందించిన మంత్రులు
by Kema Shiva Kumar |
పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు కేబినెట్ హోదాతో కూడిన పదవిని కట్టబెట్టారు. అందుకు సంబంధించి సీఎస్ ఎస్.రామకృష్ణ రావు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే, తాజాగా పి.సుదర్శన్ రెడ్డి సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి తుమ్మల, ఇతర నేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోనే సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story






