- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్చలకు మంత్రుల కమిటీ పిలుపు.. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం
మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆర్టీసీ జేఏసీ నాయకులు కాసేపట్లో అత్యవసరంగా సమావేశం కానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతున్న వేళ జేఏసీ (JAC) నేతలు ఇవాళ అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ, ఉన్నతాధికారుల కమిటీ నేడు చర్చలకు పిలిచిన నేపథ్యంలో వారు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నా, సరైన హామీ లేనిదే వెనక్కి తగ్గకూడదని జేఏసీ భావిస్తోంది. ఇవాళ మంత్రుల బృందంతో భేటీ కావాలా.. వద్దా? అన్న విషయంపై నేటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నర్సంపేట వెళ్లేందుకు యోచన..
మరోవైపు, నర్సంపేట (Narsampet)లో డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో, అక్కడి కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు జేఏసీ నేతలు నర్సంపేట వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. అయితే, మంత్రుల కమిటీ గురువారం రాత్రి కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని, సమ్మెను విరమించాలని ప్రభుత్వం కోరుతోంది. జేఏసీ నేతలు చర్చలకు వెళ్లారా.. లేదా అన్నది ఉత్కంఠగా మారింది. సమ్మె విరమణ దిశగా అడుగులు పడతాయా.. లేక ఉద్యమం మరింత ఉధృతం అవుతుందా అనేది మరికాసేపట్లో తేలనుంది.






