- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల్లో మనోళ్లే పార్టీకి ద్రోహం చేశారు: మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికల్లో మనోళ్లే పార్టీకి ద్రోహం చేశారు: మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎస్ఐ చర్చిలో క్రైస్తవ సోదరులను కలిసి క్రిస్మస్(Christmas) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో(Sarpanch Elections) కొందరు పార్టీకి ద్రోహం చేశారని కీలక ఆరోపణలు చేశారు. అక్రమార్కులకు అండగా నిలిచారని అన్నారు. అధికారులు, పోలీసులు వారికి వత్తాసు పలకడం ఆపాలని హితవు పలికారు. లేదంటే చర్యలు తప్పవు మంత్రి వివేక్ హెచ్చరించారు. చెన్నూర్‌లో ఇసుక మాఫియాకు చోటు లేదు.. సొంతపార్టీ వారైనా వదిలేది లేదని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. అందరి లెక్కలు తేలుస్తా మంత్రి వివేక్ వార్నింగ్ ఇచ్చారు.






