- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T Congress: అడ్లూరి ఆ సంగతి మర్చిపోతున్నాడు.. పొన్నం వర్సెస్ అడ్లూరి వివాదంపై వివేక్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‍లో తీవ్ర దుమారం రేపిన మంత్రులు పొన్నం వర్సెస్ అడ్లూరి వివాదంపై మరో మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‍లో కేబినెట్ మంత్రులు తీరు పూటకో మలుపు తిరుగుతోంది. తీవ్ర కలకలం సృష్టించిన మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య రగడ పీసీసీ సమక్షంలో సద్దుమణిగిన సంగతి తెలిసిందే. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య ఏర్పడిన స్పార్క్ అధికార పార్టీని డిఫెన్స్ లోకి పడేసినంత పని చేసింది. ఇంతలో అలెర్ట్ అయిన పార్టీ పెద్దలు పీసీసీ చీఫ్ సమక్షంలో ఈ ఇద్దరు నేతలను కూర్చోబెట్టి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టారు. అంతా ఓకే అయిపోయింది అనుకుంటున్న వేళ ఈ ఇష్యూలో ప్రమేయం ఉన్న మరో మంత్రి వివేక్ వెంకట స్వామి (Vivek Venkatswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో క్లోజ్ అయిపోయిన ఎపిసోడ్ వివేక్ వ్యాఖ్యలతో మరోసారి తెరపైకి వచ్చినట్లైంది.
అడ్లూరి ఆ విషయం మర్చిపోయారు:
ఇవాళ నిజామాబాద్‍లో జరిగిన మాలల సదస్సులో మంత్రి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్‍ని రెచ్చగొట్టి విమర్శలు చేయించారని అన్నారు. నేను మాల కావడం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారని వివేక్ ను విమర్శించడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు చూస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను ఇన్ చార్జిగా ఉన్నానని జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాకు మంచి పేరు వస్తుందనే విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని, కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారన్నారు. మాల, మాదిగ గొడవలు మానుకోవాలన్నారు. ఇది సరైన పద్దతి కాదని దళితులకు ఎక్కడికి వెళ్లిన వివక్ష ఉంటోందని మనమంతా కలిసి పోరాడాలన్నారు. మనమంతా కలిసి 18 శాతం రిజర్వేషన్ కోసం పని చేయాలన్నారు. నాకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు.
అయితే బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాదిగ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి వివేక్ చెవిలో పొన్నం చేసిన వ్యాఖ్యల పట్ల అడ్లూరి తీవ్ర మనస్థాపం చెందారు. ఎన్నికల వేళ బీసీ, మాదిగ, మాల మంత్రుల మధ్య నెలకొన్న ఈ ఇష్యూ పార్టీలో తీవ్ర స్థాయిలో రచ్చగా మారింది. పరిస్థితి చేయి దాటిపోకముందే పీసీసీ చీఫ్ ఎంట్రీతో వ్యవహారం అంతా కామ్ అయిపోయింది. ఇంతలో ఈ విషయంపై వివేక్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి.






