బీసీ కాకపోయినా CM రేవంత్ ఆ పనిచేశారు: మంత్రి శ్రీహరి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీసీ బిడ్డలంతా ఐక్యంగా ఉండి 42 శాతం రిజర్వేషన్లు సాధించేకునేలా ముందుకు వెళ్లాలని మంత్రి వాకిటి శ్రీవారి సూచించారు.

బీసీ కాకపోయినా CM రేవంత్ ఆ పనిచేశారు: మంత్రి శ్రీహరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ బిడ్డలంతా ఐక్యంగా ఉండి 42 శాతం రిజర్వేషన్లు సాధించేకునేలా ముందుకు వెళ్లాలని మంత్రి వాకిటి శ్రీవారి సూచించారు. ఏ సామాజిక వర్గం వారు జనాభా ఎంత ఉన్నారో వారికి అంత శాతం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా ఎవరు ఎంత ఉన్నారో వారికి అంతా వాటా కేటాయించాలని పక్రియకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అని బిల్లులు అసెంబ్లీలో ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చట్టాలు చేయడానికి లేదు అందుకు కేంద్రం ఆమోదం కావాలన్నారు. బిల్లు ప్రవేశపెట్టి ఐదు గడిచిన కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అధికారాలు అన్ని ఉపయోగించి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు.

Next Story