కాసేపట్లో జూరాలకు మంత్రి ఉత్తమ్.. అధికారులతో అత్యవసర సమావేశం

by Kema Shiva Kumar |

జూరాల (Jourala) ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్ట్ నాలుగు గేట్ల రోప్‌లు తెగిపోయిన విషయం తెలిసిందే.

కాసేపట్లో జూరాలకు మంత్రి ఉత్తమ్.. అధికారులతో అత్యవసర సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: జూరాల (Jourala) ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్ట్ నాలుగు గేట్ల రోప్‌లు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) జూరాల ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. తెగిపోయిన నాలుగు గేట్ల రోప్‌లను పరిశీలించనున్నారు. అదేవిధంగా క్రస్ట్ గేట్ల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ప్రాజెక్టు యొక్క భద్రతపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, జూరాల ప్రాజెక్టులో మొత్తం 67 రేడియల్‌ గేట్లు (Radial Gates) ఉండగా అందులో ఎనిమిది గేట్ల రోప్‌లు నీటి ప్రవాహానికి తుప్పుపట్టాయి. అందులో నాలుగింటిని అధికారులు మార్చేశారు. అయితే, 8, 12, 19, 27 గేట్ల రోప్‌లు మార్చాల్సి ఉంది. కానీ, అకస్మాత్తుగా రోప్‌లు తెగిపోయాయి. ప్రస్తుతం 12వ గేటు నుంచి వాటర్ దిగువకు లీక్ అవుతున్నాయి. మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka)లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా 12 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల రేప్‌ల పునరుద్ధరణ పనులను అధికారులు ప్రారంభించారు.

Next Story