- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ కేబినెట్ విస్తరణ(Telangana Cabinet Expansion)కు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ విస్తరణ(Telangana Cabinet Expansion)కు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను హైకమాండ్(Congress High Command)ను పంపించడం.. హైకమాండ్ ఫైనల్ చేయడం అన్నీ చకచకా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న ఉగాది(Ugadi) పర్వదినాన రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ(Governor Jishnu Dev Varma)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ గురించి అధికారికంగా సీఎం రేవంత్ గవర్నర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వచ్చేనెల 3వ తేదీ నాడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్టు గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది.
ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగమతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంతకుముందు పలువురు మీడియా ప్రతినిధులు కేబినెట్ విస్తరణపై ప్రశ్నించారు. దీంతో కేబినెట్ విస్తరణ(TG Cabinet Expansion)పై తనకు ఎలాంటి సమాచారం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై తాను ఇప్పుడే స్పందించబోనని చెప్పారు. అయితే.. వచ్చే నెల మూడో తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అంటూ ఓ వైపు వార్తలు వస్తుంటే.. తనకేం తెలియదంటూ స్వయంగా రాష్ట్ర మంత్రే మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. అసలు కేబినెట్ విస్తరణ ఉందా? లేదా? అనే కొత్త చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది.
మరోవైపు.. కొత్తగా నలుగురికి మంత్రి వర్గం(Telangana Cabinet)లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్‌నగర్‌జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్జిల్లా నుంచి గడ్డం వివేక్‌కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. అయితే, చివరి నిమిషంలో ఏమైనా కొత్త పేర్లు చేరుతాయా? అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నది.






