- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam: వారికి 25 శాతం అదనపు జీతాలు.. మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్
ఎస్ఎల్‍బీసీ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్‍బీసీ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్‍బీసీ సొరంగం పనుల పురోగతిపై ఇవాళ సెక్రటేరియట్‍లో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, సాగునీటి శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కల్నల్ పరిఖ్షిత్ మెహ్రా, సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బోజ్జా తదితర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్‍బీసీ పనుల పునఃప్రారంభం, సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. టీబీఎం స్థానంలో ఆధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు చేపడుతామని, 9.8 కిలోమీటర్ల సొరంగం మార్గంపై ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే పూర్తయిందని చెప్పారు. భూగర్భ పరిస్థితుల అంచనాకు సపోర్ట్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. సొరంగ మార్గం రెండువైపులా తవ్వకాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గంగా ఎస్ఎల్‍బీసీ నిలవబోతోందన్నారు.ఈ సొరంగ మార్గం పనుల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఇస్తామని అలాగే నిర్మాణ పనులపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఎస్ఎల్‍బీసీ పూర్తి చేసి నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేస్తామన్నారు.






