- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaleswaram Report: కాళేశ్వరం ప్రాజెక్టుపై దూకుడుగా ప్రభుత్వం.. త్వరలో అరెస్టులు తప్పవా?
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఉత్కంఠ రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక (Kaleswaram Commission) ఉత్కంఠగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన రిపోర్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వద్దకు చేరగా ఈ రిపోర్టు సారాంశాన్ని క్రోడీకరించేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నివేదికపై కమిటీ అధ్యయనం పూర్తి చేసింది. సాయంత్రానికి పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నివేదిక నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయి నివేదికపై చర్చించనున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) భేటీ కాబోతున్నారు. రేపు ఈ నివేదికపై చర్చించడానికి సింగిల్ పాయింట్ ఎజెండాతో మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ నేపథ్యంలో అధికారుల కమిటీ సమర్పించిన సారాంశాన్ని ముఖ్యమంత్రితో ఉత్తమ్ చర్చించనున్నారు. రేపు కేబినెట్ భేటీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
సర్కార్ చర్యలపై ఉత్కంఠ:
జస్టిస్ పీసీ ఘోష్ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పిదాలకు కేసీఆర్ నిర్ణయాలే కారణం అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని తానై కేసీఆర్ ఈ ప్రాజెక్టులో జోక్యం చేసుకున్నారని నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సైతం సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగారని ఈ నివేదిక స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సస్పెన్స్ గా మారింది. ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చర్యల్లో భాగంగా ఏదైనా అరెస్టులు ఉండబోతున్నాయా అనేది సస్పెన్స్ గా మారింది.






