- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోటీసులకే వణికిపోతే ఎలా?.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
మేడిగడ్డలో బాంబులు అని తప్పుడు కామెంట్స్ చేసినందుకు.. ఎన్‌డీఎస్ఏపై విమర్శలు చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డలో బాంబులు అని తప్పుడు కామెంట్స్ చేసినందుకు.. ఎన్‌డీఎస్ఏపై విమర్శలు చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సెక్రెటేరియట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలోనే కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ అని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు నీళ్లు ఇవ్వడానికి కాదని, కేవలం బీఆర్ఎస్ నేతల జేబులు నింపుకోవడానికే అని ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టిని వదిలి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టించారన్నారు. కాళేశ్వరంకు పెట్టిన పైసలతో ఎల్ఎల్‌బీసీ, సీతారాంసాగర్, డిండి ప్రాజెక్టులు పూర్తయ్యేవని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వికృత, వికారమైన చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నోటీసులకు భయపడి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని.. నోటీసులకు వణికిపోతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.84 వేలతో మొదలై.. కాగ్ రిపోర్ట్ ప్రకారం రూ.లక్ష 20వేలకు చేరిందన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని తప్పుడు ప్రచారం చేశారని.. కమీషన్లకు కకుర్తిపడి మేడిగడ్డకు బ్యారేజీని తరలించారని ఆరోపించారు. జ్యుడీషియల్ కమిషన్‌ను తప్పుపట్టడం కరెక్ట్ కాదన్నారు. మేడిగడ్డపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఎఫ్ఐఆర్ చేశారని.. అక్కడ బాంబులు ఉన్నాయా లేదా అని ఎందుకు తేల్చలేదని ఫైర్ అయ్యారు. జ్యుడీషియల్ సంస్థ ఇండిపెండెంట్ బాడీ అని.. జ్యుడీషియల్ సంస్థకు, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరు కావాలని, బాంబులపై అనుమానం ఉంటే కమిషన్ ముందు హాజరై కమిషన్‌కు ఆధారాలు ఇవ్వాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్‌లో తప్పులు చేసినట్లు నిపుణులు చెప్తున్నారని వెల్లడించారు.






