- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కేటాయింపుల వివరాలన్నీ కేంద్రమంత్రికి వివరించా.. మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్
పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS హయాంలో కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్(Palamuru-Ranga Reddy Project)కు నిధులు ఇవ్వలేదని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.లక్ష కోట్లు కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణాజలాల్లో 70శాతం వాటా రావాల్సిఉండేది.. కానీ బీఆర్ఎస్ నిర్లక్ష్యం మూలంగా కేటాయింపులు సరిగా జరుగలేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాల సమావేశానికి హాజరై ట్రిబ్యునల్ కేటాయింపులను కేంద్రమంత్రికి వివరించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మూడేళ్లలోనే అద్భుతం సృష్టించాం.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాం అని బీఆర్ఎస్ నేతలు పదే పదే కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల తెలివి లేనితనం వల్ల మూడేళ్లకే కుంగిపోయిందని విమర్శించారు.
మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ జూన్ 5న, హరీశ్‌రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.






