రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలి : మంత్రి తుమ్మల

by Naga Rani Yarlagadda |

రైతుల పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేయాలని, రాష్ట్రంపై విమర్శలు మానాలని తుమ్మల హితవు పలికారు.

రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలి : మంత్రి తుమ్మల
X
  • కేంద్ర మంత్రి బండి సంజయ్​పంటలను మోడీ ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకోవాలి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రం నుండి ఎలాంటి సహాకారాలు అందించకపోగా, పంటలను కొంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన బండి సంజయ్​కుమార్​కు బహిరంగ లేఖ రాశారు. ఈసందర్బంగా వివరిస్తూ మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం ఏమిటని, ఆసలు రాష్ట్ర పరిధిలోకి రాదని విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్​అధికారం చేపట్టిన తరువాత రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామని 2 లక్షల వరకు 25 వేల మంది రైతులకు రూ.20,625 కోట్ల రుణమాపీ చేశామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చాలా ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామనిప్రకటన చేసి అదికారం చేపట్టిన తరువాత రుణమాఫీ చేసిన దాఖాలాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్​చేశారు.

పంట కొనుగోళ్ల విషయంలో మీమాటలు చూస్తూంటే అర్ధంలేనివని తెలుస్తోందని, మా ప్రభుత్వం అదికారంలో వచ్చిన తరువాత కేంద్రం విధించిన పరిమితులకు మించి పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటలు సేకరించినట్లు చెప్పారు. కేంద్ర అసలే కొనుగోలు చేయని జొన్న, మొక్కజొన్న పంటలు కూడా తాము కొనుగోలు చేశామన్నారు. ప్రతి ఏటా వరి ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రా తోడ్పాటు అందిస్తుందనే మాట వాస్తమేనని, రాష్ట్రంలో కేవలం వరి పంట మాత్రమే పండదని, ఇతర పంటలు కూడా పండుతాయని వాటి కొనుగోలు విషయంలో రాష్ట్రంపై భారకుండా కేంద్రం తోడ్పాటు అందిస్తే బాగుంటుందని సూచించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి మీరు లేఖలో పేర్కొనట్లు ప్రతి గింజను కేంద్రమే కొనాలి, వరి ధాన్యమే కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని అడగాలని సూచించారు. మీ పరపతితో కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి, రైతాంగానికి మేలు చేయాలన్నారు. అప్పడు ఇలాంటి బహిరంగ లేఖలు రాసి మా ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టాలని కోరారు. కేంద్రం నుంచి సహాయ, సహకారాలు కరువైన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా రైతులు అందే పథకాలు, పంట కొనుగోళ్ల విషయంలో వెనకాడలే ప్రసక్తిలేదని కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్​ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పంటలను కేంద్రమే కొంటుందని చెప్పకోవడం సరికాదన్నారు. కేంద్రం రైతులు ఏమి చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని హితువు పలికారు.

Next Story