రైతులు లాభం వచ్చే పంటలను పండించాలి : మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

ప్రపంచ వ్యాప్తంగా పండే ప్రతీ పంట పండించేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం అంబేద్కర్​ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన 19వ గ్రాండ్​ నర్సరీ మేళాలను ప్రారంభించారు.

రైతులు లాభం వచ్చే పంటలను పండించాలి : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా పండే ప్రతీ పంట పండించేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం అంబేద్కర్​ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన 19వ గ్రాండ్​ నర్సరీ మేళాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల పండ్ల చెట్లు, పూలచెట్లతో పాటు రైతులు లాభం వచ్చే పంటలను పండించాలని సూచించారు. పచ్చదనాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని అన్నీ జిల్లా కేంద్రాల్లో నర్సరీ మేళాలు నిర్వహించాలన్నారు. నర్సరీలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చి హైదరాబాద్​లోనే కాకుండా పట్టణ వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రపంచ దేశాల్లో ఏ పంట పండినా ఆ పంటను మన రాష్ట్రంలో పండించేందుకు అనువైన వాతావారణం ఉందన్నారు.

అకడమియా, ఆర్గానెట్​ తదితర అన్ని రకాల పండ్ల చెట్లు, పూలచెట్లతో పాటు రైతులకు లాభం వచ్చే పంటలను రైతులు పండించుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇలాంటి నర్సరీలు రైతాంగానికి, పట్టణ వాసులకు ఉపయోగపడాలన్నారు. ప్రతీ ఏటా పెద్ద ఎత్తున గ్రాండ్​ నర్సరీ మేళాను నిర్వహించేందుకు ప్రోత్సహించడం, అదేవిధంగా పండ్లు, పూలమొక్కలు, కూరగాయల మొక్కల నర్సరీలను ప్రోత్సాహించేందుకు హార్టీకల్చర్​ డిపార్ట్​మెంట్​ కృషి చేస్తుందన్నారు. అనంతరం ఉద్యాన శాఖ డైరెక్టర్​ యాస్మిన్​ భాషా వివరిస్తూ నర్సరీమేళాలో భారతదేశంలోని అన్ని పూలమొక్కలను అందుబాటులో ఉన్నాయని ఈనెల 26 వరకు మేళా ఉంటుందన్నారు. అన్ని రకాలు ఆర్నమెంటల్​ ప్లాంట్స్​ ఫ్లవరింగ్​, ఫ్రూట్స్​, ఎక్సాటిక్​ ప్లాంట్స్​ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మేళా ఇంచార్జీ ఖాలీద్​ అహ్మద్​ మాట్లాడుతూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటలకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు.

Next Story