థాంక్స్ చెబుతూనే కిషన్‌ రెడ్డికి చురకలు అంటించిన మంత్రి తుమ్మల.. అసలేం జరిగిందంటే?

by Gantepaka Srikanth |

పత్తి కొనుగోళ్ల(Cotton Purchases) విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించినందుకు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలంగాణ రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

థాంక్స్ చెబుతూనే కిషన్‌ రెడ్డికి చురకలు అంటించిన మంత్రి తుమ్మల.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పత్తి కొనుగోళ్ల(Cotton Purchases) విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించినందుకు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలంగాణ రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే మూడుసార్లు సీసీఐ (CCI) ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు, అలాగే ఈ అంశాన్ని స్వయంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కొత్త నిబంధనలు రూపొందించే ముందు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నట్లయితే, ఇలాంటి ప్రతిష్టంభనలు వచ్చేవి కావని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ వలన జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనడానికి ముందుకు వచ్చినట్టు వివరించారు. అనేక ప్రధాన పంటల సాగు, దిగుబడిలో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఎక్కువగా తేలికపాటి నేలల్లో జరుగుతుందని, అధిక సాంద్రత పత్తిసాగు పలు జిల్లాల్లో ప్రయోగదశలో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు సహకారం అందించడం లేదన్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన పత్తి మద్దతు ధర (MSP) రైతుల సాగువ్యయాలకు తగ్గట్టు లేదని వ్యాఖ్యానించారు. ఈ ధర 2021, 2022 సంవత్సరాల్లో కూడా రైతులు ప్రైవేట్‌గా అమ్ముకున్న ధర కంటే తక్కువగానే ఉందన్నారు. 2010వ సంవత్సరంలోనే క్వింటాలుకు రూ.6000 ధర దక్కిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. గత పదేళ్లలో పెరిగిన ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుత మద్దతు ధర తగినదిగా లేదన్నారు. దీనికి సంబంధించి గత నెలలో CACP చైర్మన్ గారిని కలిసి కూడా లేఖ సమర్పించడం జరిగిందని తెలియజేశారు.

“మద్దతు ధర ప్రకటించిన పంటలలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలు కొనుగోలు చేస్తోంది?.. కేంద్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేసే కంది, పెసర, సోయాబీన్ పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేటప్పుడు విధించే 25% సీలింగ్ పరిమితిని ఎత్తివేసి, మొత్తం పంట సేకరణకు అనుమతి ఇవ్వగలదా?” అని అన్నారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా కేంద్రం ముందుకు రావాలని, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాల్సిందిగా కోరారు.

“పత్తి కొనుగోళ్లలో రాష్ట్రం సహకారం అందించడం లేదన్నది పూర్తిగా అవాస్తవం. ఇప్పటికే జిన్నర్లను, సీసీఐ ప్రతినిధులను సమావేశ పరిచి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంబన తొలగించే విధంగా చూసామని, ఇకనైనా సీసీఐ ప్రతినిధులు టెండర్లు, జిన్నింగ్ మిల్లులతో ఒప్పందాలు, నోటిఫికేషన్ వంటి ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి త్వరిత గతిన కొనుగోళ్లకు సిద్ధం కావాలని, తెలంగాణ పత్తి రైతులకు తేమ శాతం మీద పూర్తి అవగాహన ఉన్నదని, మార్కెటింగ్, వ్యవసాయ శాక ఎప్పటికప్పుడు ఈ దిశలో రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Next Story