Minister Thummala: పత్తి కొనుగోలు నిబంధనలు సడలించాలి.. కేంద్ర మంత్రికి తుమ్మల లేఖ

by Ramesh Naini |   (  Updated:2025-11-03 12:40:56  IST  )

తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై సీసీఐ విధించిన కొత్త నిబంధనలను సడలించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు.

Minister Thummala: పత్తి కొనుగోలు నిబంధనలు సడలించాలి.. కేంద్ర మంత్రికి తుమ్మల లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనలను సడలించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాలకు లేఖ రాశారు. సీసీఐ తాజాగా ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలి అని నిబంధన విధించిందని, ఇది పత్తి రైతులకు తీవ్ర నష్టం చేస్తోందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు నమోదయ్యాయని వివరించారు.

ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీసీఐ కొత్త పరిమితులు రైతాంగానికి అన్యాయమని తుమ్మల అభిప్రాయపడ్డారు. అలాగే తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన లేఖలో కోరారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే పత్తి కొనుగోళ్లు (cotton purchase) కొనసాగించాలంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే తేమ శాతం 20 వరకు ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి ఐఏఎస్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి భాయ్ తదితర ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

READ MORE ....

పత్తి రైతుల గోస ప్రభుత్వాలకు పట్టదా..?

Next Story