ఉదయం 10:40 దాటినా డ్యూటీకి రాని ఉద్యోగులు.. షాకిచ్చేలా మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన మంత్రిత్వశాఖ పరిధిలోని శాఖలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగుల(Secretariat Employees) హాజరుపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) సమీక్ష నిర్వహించారు.

ఉదయం 10:40 దాటినా డ్యూటీకి రాని ఉద్యోగులు.. షాకిచ్చేలా మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన మంత్రిత్వశాఖ పరిధిలోని శాఖలు మరియు కార్పొరేషన్ల ఉద్యోగుల(Secretariat Employees) హాజరుపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) సమీక్ష నిర్వహించారు. ఉదయం 10.40 వరకు కూడా తమ విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాని ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటలకు వరకు విధులకు హాజరుకావాలని, హాజరుకాని ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులంతా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా పనిచేయాలని, రైతులకు కావాల్సిన టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని, పంటలు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

యూరియా పరిస్థితులపైనా మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వస్తున్న యూరియాను డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాల వారిగా కేటాయించాలని, అలాగే బుధవారం జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలు త్వరగా సేకరించాలని వ్యవసాయశాఖ(Agriculture Department) డైరెక్టర్ గోపిని ఆదేశించారు.

Next Story