- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చొరవతో బతుకమ్మ చీరలు.. చేనేత రంగానికి అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి తుమ్మల
మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాట బాటలు వేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. శనివారం రవీంద్ర భారతిలో ఆయన 110 జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసంగిస్తూ ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడు అని, బాపూజీ దేశ స్వాతంత్ర్య పోరాటంతో పాటు, తెలంగాణ సాయుధ పోరాటం లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారని రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యజించిన మహానీయుడని ఆయన కొనియాడారు.
లక్ష్మణ్ బాపూజీ ఒక గొప్ప నాయకుడు. ఆయన తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేశారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని వెల్లడించారు. వారి ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ముందు తరాలకు తెలిసేలా హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కూడా ఆయన పేరు పెట్టామని తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా చేనేత కార్మికుల రుణమాఫీ చేశామని చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చొరవతో బతుకమ్మ చీరలు వర్క్ ఆర్డర్‌తో చేనేత కార్మికులు నిలదొక్కుకునేలా ప్రజా ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.






