- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cotton : పత్తి కొనుగోళ్లపై స్పష్టత.. సీసీఐ, జిన్నింగ్ మిల్లులతో మరోసారి మంత్రి తుమ్మల సమావేశం
పత్తి కొనుగోళ్లకు సంబంధించి మరోసారి సీసీఐ ఎండీ, జిన్నింగ్ మిల్లర్లు తో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం సమావేశం కానున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పత్తి కొనుగోళ్లకు సంబంధించి మరోసారి (CCI) సీసీఐ ఎండీ, జిన్నింగ్ మిల్లర్ల (ginning mills)తో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) సోమవారం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం రాష్ట్రంలో సీసీఐ కొనుగోళ్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పత్తి రైతులకు మద్దతు ధర దక్కే విధంగా అన్ని రకాల చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. రాష్ట్రంలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 24.70 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి కాగలదని అంచనా వేశారు. ఇప్పటికే పత్తి కొనుగోళ్లలో దళారులు ప్రవేశించి కేంద్ర ప్రకటించిన మద్దతు ధర కంటే రూ. 1100 తక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీలైనంత త్వరగా సీసీఐ కేంద్రాలు ప్రారంభిస్తే రైతులు దళారుల వద్దకు వెళ్లరని.. త్వరగా తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.






