TG: రాష్ట్ర ప్రభుత్వ సమాచారం బీఆర్ఎస్‍కు లీక్!.. వారికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2025-11-25 11:45:03  IST  )

కేబినెట్ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లీకు వీరులను హెచ్చరించారు.

TG: రాష్ట్ర ప్రభుత్వ సమాచారం బీఆర్ఎస్‍కు లీక్!.. వారికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్‍లో జరిగిన చర్చల సారాంశం మొత్త ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్న లీకు వీరుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు (Shridhar Babu) స్పందించారు. ఇవాళ సెక్రటేరియట్‍లో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు స్పందిస్తూ ఈ లీకుల విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని కేబినెట్ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాల లీక్‍లపై (Government Information Leak) విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కేబినెట్ సైతం ఇదే ఆలోచనతో ఉందన్నారు. కేబినెట్ నిర్ణయాలు చాలా కాన్ఫిడెన్షియల్ అని అలాంటిది ఇంకా జీవోలు రాకముందే వాటి సారాంశం ఇతరులకు చేరవేడం అంటే అలాంటి ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశం మొత్తం గులాబీ లీడర్లకు వెంటనే చేరుతున్నట్టు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు తరలించాలని నిర్ణయించారు. అందుకోసం పరిశ్రమల శాఖ రూపొందించిన ‘హిల్టప్’ పాలసీని ఆమోదించారు. అయితే ఈ పాలసీకి సంబంధించిన విధివిధానాలు తయారు చేసి ఆ శాఖ సెక్రెటరీ ఆమోదించిన తర్వాత జీవో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ లోపే కొందరు ఆఫీసర్లు డిటెయిల్స్ అన్నీ గులాబీ పార్టీ నేతలకు చేరవేసినట్టు ప్రచారం జరుగుతున్నది. వాటిని ఆధారంగా చేసుకుని సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీ భూముల బదిలీ పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు కాంగ్రెస్ పాలకులు తెరలేపారని ఆరోపించారు. ఈ లీకు విషయంలో దిశ దినపత్రిక సైతం 'పరిశ్రమల శాఖలో బీఆర్ఎస్ కోవర్టులు!' అంటూ ఈ నెల 22వ తేదీన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు పై వ్యాఖ్యలు చేశారు.

Next Story