Sridhar Babu: తెలంగాణ అత్యంత అనుకూల పరిస్థితులున్నాయి

by Gantepaka Srikanth |

విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ స్టేట్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

Sridhar Babu: తెలంగాణ అత్యంత అనుకూల పరిస్థితులున్నాయి
X

దిశ, వెబ్‌డెస్క్: విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ స్టేట్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్ఐసీసీలలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిషన్‌‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందన్నారు. భవిష్యత్తు కోసం ఎదురుచూడకుండా, భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తున్నదని అన్నారు. తెలంగాణ అవకాశాల ఖని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. జైన సమాజం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందన్నారు.

Next Story