- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీక్షా దివస్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటో దీక్షా దివస్‌లో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. శనివారం నాంపల్లి కోర్టు వద్ద మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అలాగే పలు ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. వీటిని ప్రజలకు వివరించేందుకు 10 రోజుల పాటు తాము కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వాటిని అడ్డుకునేందుకే దీక్షా దివాస్ 10 రోజులు చేయాలని కుట్ర చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
అబద్ధాల పునాదుల మీద, మా వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు పద్దతులో రాజ్యమేలాలని చూస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో మీ తప్పుడు మార్ఫింగ్, తప్పడు విధానాలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్‌కు ఉపయోగపడాలని అన్నారు. పని గట్టుకుని తప్పడు ప్రచారాలను ప్రచారం చేస్తున్నారని, మీడియాను సొంత ప్రయోజనాలకు వినియోగంచుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవాల మీద నిలబడి పోరాటం చేయాన్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి పార్టీ పదేళ్లపాటు ఉందని ఇప్పడు మేం కూడా పదేళ్ళ పాటు ఉంటామని తెలిపారు.
నాంపల్లి కోర్టులో హాజరైన మంత్రి సీతక్క
కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని 2021లో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షపై మంత్రి సీతక్కపై కేసు నమోదైంది. సీతక్కతో పాటు అప్పటి ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులపై కేసు నమోదు అయ్యాయి. విచారణలో భాగంగా శనివారం ఆమె నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.






