- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలవాలి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) ప్రచారంలో భాగంగా శనివారం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ప్రాంతంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ‘అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందించే పార్టీ ఇది. అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్నాం’ అని సీతక్క వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మౌలిక వసతుల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్‌ఎస్ ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు.
మైనారిటీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ చూపిన చిత్తశుద్ధిని సీతక్క గుర్తుచేశారు. 2006లో కేంద్రంలో మైనారిటీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది కాంగ్రెస్, జస్టిస్ సచ్చార్ కమిటీని ఏర్పాటు చేసి మైనారిటీల వెనుకబాటు పరిస్థితిని అర్థం చేసుకుంది. తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని సీతక్క తెలిపారు. ఆ రిజర్వేషన్లతో వేలాది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం పొందారని ఆమె చెప్పారు. మౌలానా ఆజాద్ స్కాలర్‌షిప్‌ల ద్వారా ఉన్నత విద్యకు సహకరిస్తున్నామని, మైనారిటీ మహిళల ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని వివరించారు. ‘ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని దీవించండి. చేయి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్‌ను గెలిపించండని సీతక్క ప్రజలను అభ్యర్థించారు.






