- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NYTTA: అమెరికాలో జరిగే బోనాల ఉత్సవాలకు మంత్రి సీతక్కకు ‘నైటా’ ఆహ్వానం
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఎంపికైన వాణి ఏనుగును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association) (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఎంపికైన వాణి ఏనుగును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అభినందించారు. అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్‌లో తెలుగువారికి ఓ సంఘం ఏర్పాటు చేయటంతో పాటు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు (NYTTA) నైటా చేస్తున్న కృషిని మంత్రి సీతక్క అభినందించారు.
తాజాగా హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నైటా కొత్త కార్యవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తికి ఆదర్శంగా నిలిచి, నైటా సేవలను మరింత విస్తృత పరచాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వాణితో పాటు కుటుంబ సభ్యులను సన్మానించారు. రానున్న జూన్ లో నైటా తరపున న్యూయార్క్‌లో జరిగే బోనాల (Bonalu celebrations) ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రిని నైటా కార్యవర్గం ఆహ్వానించింది. ఇందుకు మంత్రి సీతక్క సుముఖత వ్యక్తం చేశారు.






