- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్ల కోసమే బీజేపీ మతరాజకీయాలు చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం

దిశ, వెబ్ డెస్క్: ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టంలేకనే బీజేపీ డ్రామాలు చేస్తుందని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఏమీ లేవని గుజరాత్, కర్నాటక లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో ఇక్కడ కూడా అలానే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఆ చిత్తశుద్ధి లేకనే డ్రామాలు అడుతున్నారని విమర్శించారు.
గతంలో 23 శాతానికి బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే బీజేపీ వాళ్లు నోరు మూసుకుని ఉన్నారన్నారు. బీజేపీ వాళ్లు హిందువులకు కూడా చేసింది ఏం లేదన్నారు. అగర్ బస్తీలపై కూడా జీఎస్టీ విధించారని విమర్శించారు. 42 శాతం రిజ్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నామని అన్నారు. అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని చెప్పారు. ఫామ్ హౌసులో కూర్చుంటే పనులు జరగవని విమర్శించారు. అంతేకాకుండా అధికారం కోసమే కవిత దీక్ష పేరుతో డ్రామా చేస్తోందని వ్యాఖ్యానించారు.






