Minister Seethakka : కేసీఆర్ నిజాయితీ పరుడైతే విచారణకు హాజరు కావాలి : మంత్రి సీతక్క

by Muthe.Rajitha |

గులాబీ అధినేత కేసీఆర్(KCR) పై మంత్రి సీతక్క(Minister Seethakka) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Minister Seethakka : కేసీఆర్ నిజాయితీ పరుడైతే విచారణకు హాజరు కావాలి : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : గులాబీ అధినేత కేసీఆర్(KCR) పై మంత్రి సీతక్క(Minister Seethakka) ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగా కేసీఆర్ నిజాయితీ పరుడైతే కాళేశ్వరం విచారణకు(Kaleswaram Enquiry) హాజరు కావాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(Justice PC Ghosh) నేతృత్వంలోని విజిలెన్స్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు. నిజాయితీ ఉంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1.47 లక్షల కోట్లు దాటిన ఖర్చులో అవకతవకలు జరిగాయని, ఈ డబ్బుతో కొందరు విదేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత అవతరణ దినోత్సవాన్ని అమెరికాలో జరుపుకోవడాన్ని సీతక్క ప్రస్తావిస్తూ.. ఇది లిక్కర్ కేసు నుంచి ప్రజల్ని దృష్టి మరల్చే బీఆర్ఎస్ డ్రామా అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల రూ.1 లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లలో నిరుపయోగమైందని మండిపడ్డారు.

దీనిపై విచారణను బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారని, కానీ నాలుగు స్తంభాల ఆట (అధికారం కోసం రాజకీయ కుట్రలు) వారి ఉద్దేశమని సీతక్క విమర్శించారు. కమిషన్ 50 మంది ఇరిగేషన్ అధికారులపై చర్యలు సిఫార్సు చేసిన నేపథ్యంలో సీతక్క ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో మరింత రాజకీయ హీట్ ను పెంచినట్టైంది.

Next Story