- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంత దిగజారి మాట్లాడటం అవసరమా?.. హరీష్ రావుకు సీతక్క కౌంటర్
కాంగ్రెస్ మంత్రులపై(Congress Ministers) బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మంత్రులపై(Congress Ministers) బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంట్రాక్టుల్లో వాటాల కోసమే కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు ఏర్పడుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఒకరు అని వర్గాలుగా విడిపోయారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ దండుపాళ్యం ముఠా లాగా అయిపోయింది అని హరీష్ రావు విమర్శించారు. అయితే.. హరీష్ రావు వ్యాఖ్యలకు తాజాగా మంత్రి సీతక్క(Minister Sitakka) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరుగలేదు. కేబినెట్‌లో మంత్రుల మధ్య వివాదం తలెత్తిందని ఆరోపించడం కాదు.. దమ్ముంటే హరీష్ రావు నిరూపించాలి. కేబినెట్‌లో ప్రజా సమస్యలే ఎజెండాగా చర్చ జరిగింది. ప్రభుత్వంపై బుదరజల్లాలని హరీష్ రావు దిగజారి మాట్లాడుతున్నారు. ఇంత దిగజారి మాట్లాడటం అవసరమా? అని హరీష్ రావుకు సీతక్క కౌంటర్ ఇచ్చారు.






