- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్ చిన్నమెదడు చితికిపోయింది : మంత్రి సీతక్క
కాళేశ్వరం (Kaleshwaram) విషయంలో కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం.. నేడు కమిషన్ ముందుకు రావడానికి భయపడుతున్నారన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తండ్రికి లేఖ రాసి.. సిస్టర్ కవిత (Kavitha) ఇచ్చిన స్ట్రోక్‌తో కేటీఆర్ చిన్నమెదడు చితికిపోయిందని మంత్రి సీతక్క (Minister Seetakka) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంత్రి సీతక్క.. గోబెల్స్ ప్రచారంలో ఆయన్ను మించినవారే లేరని ఎద్దేవా చేశారు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చని, రాహుల్ గాంధీ (Rahul gandhi)పై మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర ఎలా ఉంటుందో కేటీఆర్ మర్చిపోయారన్న సీతక్క.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయపడటం తప్పా? అని ప్రశ్నించారు. గులాబీ కూలీల రూపంలో బీఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు.
కాళేశ్వరం (Kaleshwaram) విషయంలో కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం.. నేడు కమిషన్ ముందుకు రావడానికి భయపడుతున్నారన్నారు. దానిని కప్పి పుచ్చుకునేందుకు ఈనాడు కాళేశ్వరానికి కాంగ్రెస్ బాంబులు పెట్టిందని అబద్ధాలు చెప్తున్నారన్నారు. అబద్ధానికి ప్రతినిధి గోబెల్స్ ఉంటే.. దానిని మించి అబద్ధాల పునాదులపై పార్టీని నడిపిస్తున్నారని, బెస్ట్ అవార్డు వస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉండేందుకు, ప్రజల కోసం పనిచేసేందుకు కేటీఆర్ లాంటి నాయకుడు పనికిరారని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై ఒకలా, ఈడీపై ఒకలా విమర్శలు చేస్తున్నారని, కవిత అన్న దెయ్యం కేటీఆరే అయి ఉండొచ్చన్నారు.






