BRS అధికారంలోకి రావడం.. సీఎంగా KCR హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: Minister Satyavathi Rathod

by Disha Web Desk 19 |
BRS అధికారంలోకి రావడం.. సీఎంగా KCR హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: Minister Satyavathi Rathod
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎంత మొసలి కన్నీరు కార్చినా తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను నమ్మరని, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఏనాడు మాట్లాడని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు ఎమ్మెల్సీ కవితపై చేస్తున్న అర్థరహితమైన విమర్శలను తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

కేంద్ర మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో టైంపాస్ చేస్తున్నాడే తప్ప.. గత తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి, ముఖ్యంగా గిరిజనులు, మహిళల కోసం ఏం చేసిందో ఒక్కసారైనా చెప్పడం లేదన్నారు. రాష్ట్రానికి బీజేపీ పార్టీ చేసిందేమీ లేదని, సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎందుకు తీసుకురాలేకపోయిందో, అడ్డుకున్నది ఎవరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలపడం దగ్గర్నించి, ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది పౌరుల బలిదానాల దాకా.. తెలంగాణ ప్రజలు అనుభవించిన ప్రతి కష్టానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలన్నారు.

అలాంటి కాంగ్రెస్ పార్టీకి, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్‌పై, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఎమ్మెల్సీ కవిత నిరసన తెలియజేస్తే, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మద్దతు తెలపలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లపై బీజేపీని నిలదీయలేదని, ఇది పార్టీకి మహిళా రిజర్వేషన్లపై ఉన్న చిత్తశుద్దిని స్పష్టం చేస్తుందన్నారు.



Next Story

Most Viewed