Minister Rajanarasimha: హరీష్ రావుకు మంత్రి రాజనర్సింహ స్ట్రాంగ్ కౌంటర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-19 12:35:37  IST  )

ఆరోగ్యశ్రీ సేవల(Arogyasri Services) నిలిపివేత(Discontinuation)పై కాంగ్రెస్ ప్రభుత్వా(Congress Government)న్ని విమర్శిస్తూ బీఆరెఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) చేసిన వ్యాఖ్యలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) స్ట్రాంగ్ కౌంటర్(Counte) వేశారు.

Minister Rajanarasimha: హరీష్ రావుకు మంత్రి రాజనర్సింహ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యశ్రీ సేవల(Arogyasri Services) నిలిపివేత(Discontinuation)పై కాంగ్రెస్ ప్రభుత్వా(Congress Government)న్ని విమర్శిస్తూ బీఆరెఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) చేసిన వ్యాఖ్యలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) స్ట్రాంగ్ కౌంటర్(Counte) వేశారు. పదేండ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చి, ఇప్పుడు అదే పథకం గురించి మాట్లాడడం చూస్తుంటే.. దొంగే, దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని ఘాటు రిప్లై ఇచ్చారు.

బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు డబ్బులు చెల్లించలేదని..ప్యాకేజీల ధరలు రివైజ్ చేయలేదని..సుమారు 730 కోట్లు బాకీ పెట్టి పోయారని రాజనర్సింహ మండిపడ్డారు. బీఆర్ఎస్ మిగిల్చిన అప్పులను, పెండింగ్ బిల్లుల సమస్యలను ఒక్కోటిగా మేము పరిష్కరిస్తు ముందుకెలుతున్నామన్నారు. బీఆర్ఎస్ పెట్టిన పాత బకాయిలతో సహా రూ.1130 కోట్లు ఏడాదిలో చెల్లించానమని, ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్యాకేజీల రేట్లు రివైజ్ చేసి, 22 శాతం మేర చార్జీలు పెంచినామని తెలిపారు. అయితే హాస్పిటళ్ల యాజమాన్యాలు లేవనెత్తిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఇబ్బంది ఏర్పడకుండా ఆరోగ్య శ్రీ సేవల పునరుద్ధరణకు మేం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుున్నామన్నారు.

Next Story