- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు అందుకే మంత్రి పదవి రాలేదు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లనే తనకు మంత్రి పదవి రాలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లనే తనకు మంత్రి పదవి రాలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే తనను మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం, రాహుల్ గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని చెప్పారు. కాబట్టి ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. గతంలో తమ పార్టీ అధికారంలో లేదని కానీ ఈసారి పార్టీ అధికారంలో ఉండటంతో పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని, మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా బెల్టు షాపులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత బెల్టు షాపులు బంద్ చేయించాని వ్యాఖ్యానించారు.






