- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పుపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్పుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న దశాబ్ధి వేడుకల ఏర్పాట్లను మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాం రూపకల్పన సమయంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదని.. అలాంటి వాళ్లు ఇప్పుడు మా ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే అధికారిక చిహ్నాం మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన తెలిపే హక్కు విపక్షాలకు ఉందని, కానీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే విపక్ష నేతలపై కేసులు పెట్టారని క్లారిటీ ఇచ్చారు. విపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని కౌంటర్ ఇచ్చారు.






