Minister Ponnam: ఏపీలో ముస్లిం రిజర్వేషన్లను తీయిస్తారా.. బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-03 07:57:55  IST  )

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కామెంట్ చేశారు.

Minister Ponnam: ఏపీలో ముస్లిం రిజర్వేషన్లను తీయిస్తారా.. బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కామెంట్ చేశారు. కేవలం ముస్లింలకు లబ్ధి చూకూర్చేందుకు కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations)ను రాష్ట్రమే అమలు చేయాలని చెబుతున్న సంజయ్.. అదే మాటపై కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ ఆ వెసులుబాటే తమకు ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో దర్జాగా రిజర్వేషన్లు అమలు చేసేవాళ్లమని అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల (Muslim Reservations)పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బండి సంజయ్ ఏపీలో బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్న టీడీపీ (TDP)తో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తీయిస్తారా అని సవాల్ విసిరారు. గుజారాత్ (Gujrat) సీఎంగా ఉన్న ఇదే నరేంద్ర మోడీ (Narendra Modi) ముస్లింకు రిజర్వేషన్తు ఇస్తామంటూ ప్రకటించారని.. అందుకు సంబంధించిన వీడియోను సైతం ఆయన చూపించారు.

ఢిల్లీ (Delhi)లోనూ ముస్లింకు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని అవి రద్దు చేయగలరా అని ప్రశ్నించారు. ముస్లింలలో దూదేకుల కులస్థులకు రిజర్వేషన్లు ఇప్పుడు కొత్తగా వచ్చాయా అని అన్నారు. ముందు బీసీకు 42 శాత రిజర్వేషన్లు వస్తే.. ఆ తరువాత వాటి పంపకం ఉంటుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ (BJP) కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చిందని అన్నారు. ఈడబ్ల్యూఎస్‌ (EWS)కు 10 శాతం రిజర్వేషన్లను మోడీ సర్కార్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఓసీల జనాభానే 10 నుంచి 12 శాతం ఉంటుందని.. అలాంటోళ్లకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాజకీయాలు వద్దని గతంతోనే తాము విజ్ఞప్తి చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Next Story