ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) బోనాల వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.

ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) బోనాల వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. వచ్చే నెల 13న సికింద్రాబాద్‌ (Secunderabad)లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Minister Ponnam Prabhakar) వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రితో పాటు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Thalasani Srinivas Yadav) కూడా పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బొనాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఎంత పెద్ద కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజల సహకారం లేకపోతే అవి విజయవంతం కావని అన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పాత కేబుళ్ల స్థానంలో కొత్త కేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమాలు ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Next Story