బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా పై మంత్రి పొన్నం రియాక్షన్

by Ramesh Naini |

బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా పై మంత్రి పొన్నం రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తన ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్న, బీసీ సీనియర్ నేతలు ఉన్న బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదన్నారు. గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభాపక్ష నాయకుడుని కూడా బీసీలకు ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ ఫ్యూడల్ పార్టీ.. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వేయనివకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారని తెలిపారు. ఆయన మద్దతుదారులను భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు.

బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారని, దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తోందని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని, బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. సీఎం రెడ్డి ఉంటే.. పీసీసీ అధ్యక్షుడిని బీసీనీ చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఒకవైపు కుల గణన చేసుకొని బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకు పోతుంటే.. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందని విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారని, తెలంగాణలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని చెప్పుకొచ్చారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారని గుర్తుకు చేశారు.

కాగా, బీజేపీ కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన నాంపల్లి స్టేట్ ఆఫీస్‌కి భారీ మద్దతుదారులతో వెళ్లారు. అయితే తన అనుచరులను బెదిరించారని, తాను ఇక పార్టీలో ఉండలేనని రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు.

Next Story