3038 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

by Gantepaka Srikanth |

త్వరలోనే ఆర్టీసీ(RTC)లో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు.

3038 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలోనే ఆర్టీసీ(RTC)లో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించారు. ఇప్పటివరకు ఆర్టీసీ లో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వారు రూ.5500 కోట్లు ఆదా చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని పేర్కొన్నారు.

మొత్తం 3038 ఉద్యోగాల్లో...

డ్రైవర్ -2000

శ్రామిక్ -743

డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) - 84

డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) - 114

డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ - 25

అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ - 18

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 23

సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11

అకౌంట్ ఆఫీసర్స్ - 6

మెడికల్ ఆఫీసర్స్ జనరల్ - 7

మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ - 7

పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story