- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) నిర్వహిస్తున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) నిర్వహిస్తున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల ఎజెండాతో ఎవరికి వారే ఏమునా తీరే అనేలా ఉన్నా.. ఉద్యమం విషయానికి వస్తే అందరం కలిసిగట్టుగా పోరాడాం.. సాధించుకున్నాం అని అన్నారు. తెలంగాణ పౌరుషం ఎలాంటిదో దేశమంతా తెలిసేలా చేశామని చెప్పారు. అలాగే తెలంగాణ వంటకాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు, మన భాష మన విధివిధానాలు మనకు యువతరానికి భవిష్యత్తు మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. దసరా మరునాడు ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఉండేలా దత్తాత్రేయ ఆనవాయితీగా తీసుకున్నారు. ఈసారి బండారు విజయలక్ష్మి నాయకత్వంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది. సభ బయట వివిధ అంశాలపై భక్తులు తీసుకుని కొట్లాడుకునే నేతలు కూడా ఇకడికి రాగానే తెలంగాణ కలిసిపోయారు. అదే అలయ్ బలయ్ గొప్పతనం అని చెప్పారు. ఇలాగే రేపు తెలంగాణలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. మనం ప్రజాస్వామికంగా ఎన్నికల నిర్వహణకు పోవాలని సూచించారు.






